కృత్రిమ మేధపై విశ్వాసం లేదు!

Mon,October 7, 2019 12:15 AM

-దేశీయ సీఈవోల్లో నమ్ముతున్నది 10 శాతం మందే
-పీడబ్ల్యూసీ ఇండియా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: కృత్రిమ మేధస్సు.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మాటే. మానవ మేధస్సు కంటే గొప్పగా పనిచేసే శక్తి దీనికుందని అంతర్జాతీయ దిగ్గజ టెక్నాలజీ సంస్థలెన్నో రోజూ పొగుడుతున్నదీ వింటూనే ఉన్నాం. అయితే భారతీయ సీఈవోల్లో ఈ కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ)పై విశ్వాసం మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నది. పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక ప్రకారం కేవలం 10 శాతం మందే ఏఐని నమ్ముతున్నారు. మిగతా 90 శాతం మంది తమ ఏఐ అప్లికేషన్లపై అపనమ్మకాన్నే వ్యక్తం చేశారు.

ఈ ఏడాది మే నెల నుంచి గత నెల సెప్టెంబర్ వరకు జరిగిన ఈ సర్వేలో కృత్రిమ మేధస్సుపై వెయ్యి మందికిపైగా వ్యాపారాధిపతుల అభిప్రాయాలను పీడబ్ల్యూసీ ఇండియా సేకరించింది. టెక్నాలజీ, మీడియా, టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రొఫెషనల్ సర్వీసెస్, హెల్త్, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్, కన్జ్యూమర్ మార్కెట్స్, ప్రభుత్వ తదితర రంగాల సంస్థల సీఈవోలను అడుగగా ఆసక్తికరంగా వారిలో 10 శాతం మంది మాత్రమే ఏఐపై విశ్వాసాన్ని వెలిబుచ్చినట్లు పీడబ్ల్యూసీ ఇండియా అడ్వైజరీ లీడర్ దీపాంకర్ శాన్వాల్కా తెలిపారు.

399
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles