సెలెబీకి ఆర్‌జీఐఏ నిర్వహణ బాధ్యతలు

Wed,January 9, 2019 12:16 AM

�elebi Aviation wins Ground Handling License for RGIA Hyderabad

హైదరాబాద్, జనవరి 8: గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన సెలెబీ ఏవియేషన్ హోల్డింగ్.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలు దక్కించుకున్నది. ఇందుకోసం నిర్వహించిన బిడ్డింగ్‌లో సెలెబీ అతి తక్కువగా కోడ్ చేసింది. దీంతో వచ్చే పదేండ్లపాటు విమానాశ్రయాన్ని సంస్థ నిర్వహణ బాధ్యతలు నిర్వహించనున్నది. భారత్‌లో ఇప్పటికే బెంగళూరు, కన్నూరు ఎయిర్‌పోర్ట్‌లను నిర్వహిస్తున్న సంస్థకు ఇది మూడో విమానాశ్రయ ప్రాజెక్ట్ కావడం విశేషం. టెక్నాలజీ పరంగా సేవలను మరింత విస్తృత పరుచడానికి ఆర్‌జీఐఏతో కలిసి పనిచేయనున్నట్లు కంపెనీ ఇండియా సీఈవో మురళీ రామచంద్రన్ తెలిపారు. విమాన ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించడానికి కృషి చేయనున్నట్లు ప్రకటించిన ఆయన..భద్రత, మెరుగైన సేవలు, ఎయిర్‌పోర్ట్‌లో స్నేహ పూర్వక వాతావరణాన్ని కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. భారత్‌లో సేవలు ఆరంభించి పదేళ్లు అయిన సందర్భంగా ఈ ఏడాది మరో కీలక మలుపు అని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో వ్యాపార విస్తరణకు 5-6 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేయోచనలో సంస్థ ఉన్నట్లు ఆయన తెలిపారు.

424
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles