నిటారుగా మారథాన్


Sat,July 28, 2018 11:51 PM

పరుగు ఎన్నో రకాలు. పరుగుకే మహా పరుగుగా పేరుపొందిన మారథాన్ లో సరికొత్తగా తెరమీదకు వచ్చిన పరుగే వర్టికల్ మారథాన్. సముద్రమట్టానికి కొన్ని వందల మీటర్ల ఎత్తున నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలలోని వేలాది మెట్లను అధిరోహిస్తూ పరుగెత్తడమే వర్టికల్ మారథాన్.
vertical-marathon
నేల మీద, రహదారుల్లో 42 కిలోమీటర్ల దూరం పరుగెత్తే సాధారణ మారథాన్‌కు భిన్నంగా సరికొత్తగా వర్టికల్ మారథాన్ పోటీలు తెరమీదకు వచ్చాయి. బహుళ అంతస్తుల భవనాలే వేదికగా వర్టికల్ మారథాన్ పోటీలు నిర్వహించడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. అమెరికా, హాంకాంగ్, చైనా, స్విట్జర్లాండ్ లాంటి దేశాలలోని విశ్వవిఖ్యాత టవర్స్, బహుళ అంతస్తుల భవనాలే వేదికలుగా మారుతున్నాయి. 80 నుంచి 100 అంతస్తుల భవనాలలోని వేలాది మెట్లను అధిరోహిస్తూ సాగిపోయే పరుగే వర్టికల్ లేదా మెట్ల మారథాన్. చైనా రాజధాని బీజింగ్‌లోని అత్యంత ఎత్తైన బహుళ అంతస్తుల బిల్డింగ్ పేరు చైనా టవర్స్. ఎనభైరెండు అంతస్తుల మెగా బిల్డింగ్ ఇది. ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లుగా కనిపించే ఈ టవర్స్ ను సముద్రమట్టానికి 330 మీటర్ల ఎత్తున నిర్మించారు. దీనిపైకి చేరాలంటే 2వేల 41 మెట్లు అధిరోహించాలి. ఇలాంటి మహాబిల్డింగ్ మెట్లపైన గత ఐదేళ్లుగా వర్టికల్ మారథాన్ పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు.

464
Tags

More News

VIRAL NEWS